Akhil Akkineni

Akhil Akkineni : అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్స్?

Akhil Akkineni: అక్కినేని కుటుంబంలో యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని తన డైనమిక్ లుక్, నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘లెనిన్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ సెట్ల నడుమ జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌తో అఖిల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Puri-Nagarjuna: నాగార్జునతో పూరి జగన్నాథ్ షాకింగ్ సర్‌ప్రైజ్?

Akhil Akkineni: మరోవైపు, అఖిల్ వ్యక్తిగత జీవితంలోనూ కీలక పరిణామం. ఆయన జైనబ్‌ను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాహానికి జూన్ మొదటి వారం, అంటే 6వ తేదీన డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇటీవల అఖిల్ సోదరుడు నాగచైతన్య పెళ్లి వార్తలతో అఖిల్ వివాహ విషయం కూడా చర్చనీయాంశమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Lenin: లెనిన్‌తో అఖిల్ హిట్ కొట్టేనా? డీగ్లామ్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *