Vijay – Trisha

Vijay – Trisha: కలిసిపోయిన విజయ్ – సంగీత.. సైలెంట్ అయిపోయిన త్రిష..?

Vijay – Trisha: కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి,’దళపతి’ విజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయ్ 52వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా  దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల బర్త్ డే విషెస్ ని  తమ తమ సోషల్ మీడియాల ద్వారా తెలియజెశారు. అయితే, ఈ మొత్తం హడావుడిలో గత కొంతకాలంగా విజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ ప్రచారంలో ఉన్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మాత్రం కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రతి ఏటా విజయ్ బర్త్‌డే వస్తే అందరికంటే ముందుగా సోషల్ మీడియాలో స్పెషల్ ఫొటోలు షేర్ చేసే త్రిష, ఈసారి కనీసం ఒక చిన్న పోస్ట్ కూడా పెట్టకపోవడం వెనుక అసలు కారణాలపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

విజయ్ ఫ్యామిలీ లైఫ్‌లో ప్యాచ్-అప్ – అందుకే త్రిష దూరమైందా?

చెన్నై ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన మనస్పర్థలను వీడి, తిరిగి తన భార్య సంగీతతో కలిసిపోయారని, వారిద్దరి మధ్య ప్యాచ్-అప్ జరిగిందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

కుటుంబ శాంతి కోసమేనా?: ఈ ప్యాచ్-అప్ వార్తల నేపథ్యంలో, విజయ్ కుటుంబ జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో త్రిష ఉద్దేశపూర్వకంగానే విజయ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ బర్త్‌డే నాడు తాను పోస్ట్ పెడితే మీడియాలో మళ్లీ అనవసరపు వివాదాలు, రూమర్లు చెలరేగుతాయని భావించే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

రూమర్లకు బలం చేకూర్చిన ‘ఆ ఒక్క సైలెన్స్’..

వివాదాలు రాకూడదని త్రిష సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. ఆమె వ్యవహరించిన తీరు రిలేషన్‌షిప్ రూమర్లకు మరింత బలం చేకూర్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం స్నేహపూర్వకంగానైనా ఒక చిన్న బర్త్‌డే విష్ పోస్ట్ పెట్టి ఉంటే బాగుండేదని, ఈ కంప్లీట్ సైలెన్స్ వల్లే వారిద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారానికి, వారి లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిందనే వార్తలకు పక్కా క్లారిటీ వచ్చేసిందని దళపతి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో దళపతి విజయ్ పొలిటికల్ అప్‌డేట్స్‌తో పాటు త్రిష ‘నో విష్’ వివాదం కూడా హాట్ టాపిక్‌గా రన్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *