Allu Sirish: హైదరాబాద్ షేక్‌పేటలోని తన అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఆలయం నుంచి అర్ధరాత్రి వేళల్లో వస్తున్న లౌడ్‌స్పీకర్ల సౌండ్స్ పైన టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. వినోభా నగర్‌లోని హనుమాన్ ఆలయం వద్ద అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకు పెద్ద ఎత్తున పాటలు, సంగీతం పెడుతుండటంతో కాలనీవాసులు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
అల్లు శిరీష్ ఫిర్యాదులోని ప్రధానాంశాలు..
షేక్‌పేటలోని ‘అపర్ణ వన్’ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఆలయం నుంచి అనుమతించిన శబ్ద పరిమితికి మించి రోజూ అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకు లౌడ్స్పీకర్లు మోగుతున్నాయని అల్లు శిరీష్ పేర్కొన్నారు
ఈ సమస్యపై గతంలోనే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనాలు ముగిసే వరకు సర్దుకోవాలని పోలీసులు సూచించారని తెలిపారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా అదే స్థాయిలో లౌడ్ మ్యూజిక్ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధులు, పిల్లల అవస్థలు..
నిరంతర శబ్దాల వల్ల గేటెడ్ కమ్యూనిటీలోని చిన్నపిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు, నిద్రలేమికి గురవుతున్నారని పేర్కొంటూ.. పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నెట్టింట భిన్నాభిప్రాయాలు – రాజుకున్న వివాదం..
అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది..శబ్ద కాలుష్యం అనేది ప్రజారోగ్య సమస్య అని, అది ఏ పండుగ లేదా ఏ మతానికి చెందిన కార్యక్రమం అయినా సరే అర్ధరాత్రి వేళల్లో నివాస ప్రాంతాల్లో పెద్ద శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించడం సరికాదని చాలామంది శిరీష్‌కు మద్దతుగా కామెంట్లు చేశారు.
మరో వర్గం అభ్యంతరం..
మరికొందరు నెటిజన్లు ఈ పోస్ట్‌ను తప్పుబడుతూ.. కేవలం హిందూ ఆలయాల నుంచే శబ్దాలు వస్తున్నట్లు ఎందుకు ప్రశ్నిస్తున్నారని, ఇతర మతాల ప్రార్థనా స్థలాల నుంచి వచ్చే మైకుల శబ్దాలపై ఎందుకు స్పందించడం లేదని ఎదురుదాడికి దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
అల్లు శిరీష్ చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు స్పందించారు. ఆ ప్రాంతంలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమాచారాన్ని సేకరిస్తూ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
Respected @hydcitypolice . I’m a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
— Allu Sirish (@AlluSirish) September 27, 2026
