Minister Naryana: నుడా అప్రూవల్ లేకుండా… నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఔట్ ల పై చర్యలు తప్పవని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు.. విఆర్సి సెంటర్లోని పలు ప్రాంతాలలో.. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు.. అనంతరం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.. అనాథరైజ్ లేఔట్ ల పై ఎల్ఆర్ఎస్ డిఆర్ఎస్ లపై దృష్టి సారిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.. కొండాయపాలెం దగ్గర ఓ లేఔట్ లో అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు ఇంకా మంజూరు కాలేదని వెల్లడించారు.
Minister Naryana: రోజుకి 6 నుంచి 7 దాకా అప్రూవల్స్ కోసం దరఖాస్తులు వస్తున్నాయన్నారు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అప్రోచ్ రోడ్ లేకుండా పర్సనల్గా ఇల్లు కట్టుకోవడం కుదరదని.. ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్మాణాలు చేయాలన్నారు.. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందన్నారు.. సాటిలైట్ పిక్చర్స్ ద్వారా బిల్డింగులను గుర్తిస్తామన్నారు. 2024 జూన్ ముందు వరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూల్చేస్తామని ఆయన స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.