Jogu Ramanna: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం లో ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.అదిలాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పలు ఆరోపణలు చేశారు అభివృద్ధి పై దృష్టి పెట్టకుండా పతిపక్ష పార్టీల నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు..స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గెలిచి ఎడాది గడుస్తున్నప్పటికీ ఆదిలాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు…బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పథకాలను తానే చేశానని ఎమ్మెల్యే గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంవత్సర కాలంలో నియోజకవర్గానికి ఏం చేశారో ఎమ్మెల్యే చెప్పాలని ప్రశ్నించారు.
![Jogu Ramanna](https://mahaanews.co.in/wp-content/uploads/2024/12/Jogu-Ramanna.jpg)