Achannaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెరుగుదలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడుతూ, విద్యుత్ వ్యవస్థను గత ఐదేళ్లలో నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు.
విద్యుత్ యూనిట్ రూ.5కే అందుబాటులో ఉన్నప్పుడు కూడా జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం యూనిట్ రూ.8కి కొనుగోలు చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని అన్నారు. ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం మోపిన జగన్ ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
జగన్ పాలనలో జరిగిన అవకతవకలే నేటి సమస్యలకు కారణమని, వాటి ఫలితమే ప్రజలు అధిక ఛార్జీలను భరించాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత పాలనలో చేసిన పొరపాట్లను ఇప్పుడు ప్రజలపై రుద్దడం తగదని ఆయన సూచించారు.