Kammareddy

Kammareddy: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన

Kammareddy: త్రి మిస్సింగ్ …టు ట్రేస్. బ్యాలెన్స్ వన్ ? ఎక్కడ ? ఇంతకీ మిస్ అయ్యింది ఎవరు ? మిస్ ఐన వారిని పట్టునే mr పోలీసులు. ఎస్ ..విన్నది నిజమే. మిస్సైన ముగ్గురిలో ఇద్దరు పోలీసులైతే ..ఒకరు కంప్యూటర్ ఆపరేటర్. ఒకరికి ఒకరు లింక్ ఉందా ? తెలియదు. శృతి , నిఖిల్ డెడ్ బాడీలు చెరువులో దొరికాయి. మరి మరో యస్.ఐ ఎక్కడ ? అసలు ఏమి జరుగుతుంది అక్కడ ? ఈ మిస్టరీ వెనుక అసలు మిస్టరీ ఏంటి ..రంగంలోకి దిగిన పోలీసులు త్వరలోనే బయటపెడతాం అంటున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఇద్దరు పోలీసులతో పాటు మరో యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన సంచలంగా మారింది. ఓ మహిళా కానిస్టేబుల్ సహా ఎస్సై కనిపించకుండా పోవడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. అదే సమయంలో జిల్లాలోని ఓ కో-ఆపరేటివ్ సొసైటీలో పనిచేసే మరో యువకుడి ఆచూకీ కూడా కనిపించకపోవడంతో పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. ఈ క్రమంలోనే కనిపించకుండాపోయిన ముగ్గురిలో ఇద్దరు శవాలై కనిపించడం, మరొకరి కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఘటన జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Kammareddy: కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసు ఠాణాలో సాయి కుమార్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇదే జిల్లాలోని బీబీపేట ఠాణాలో శ్రుతి అనే యువతి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. కానిస్టేబుల్ శ్రుతి స్టేషన్ లో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్నట్లు స్టేషన్లో చెప్పి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కనిపించలేదు. సాయంత్రం అయినా యువతి ఇంటికి చేరుకోకపోవడం, సెల్ ఫోన్ స్విచ్చ్ ఆఫ్ వస్తుండడంతో.. పోలీస్ స్టేషన్ సిబ్బందిని సంప్రదించారు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు విషయాన్ని అధికారులకు చేరవేశారు.

ఇదే సందర్భంలో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ అందుబాటులో లేకుండా పోయింది. ఆయన కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా వీలు కాకపోవడంతో ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడం.. ఇంట్లో, తెలిసిన వాళ్ల దగ్గరకు వెళ్లకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఒకే రోజు ఇద్దరు పోలీసులు అదృశ్యం కావడంతో వారి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ శృతి మొబైల్ సిగ్నల్ ఆధారంగా సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద గుర్తించారు. అనుమానంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

Kammareddy: పరిసరాల్లో రాత్రి 11 గంటల సమయంలో కానిస్టేబుల్ శృతితో పాటు మరో యువకుడి మరొకరి సెల్ ఫోన్ లభ్యమైంది. పోలీసుల విచారణలో.. బీబీపేట కో-ఆపరేటివ్ సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న నిఖిల్ అనే యువకుడిదిగా నిర్ధారణ అయ్యింది. వాటితో పాటు భిక్కనూరు ఎస్సై సాయికుమార్ చెప్పులు, కారు సైతం అక్కడే కనిపించడంతో అనుమానంతో చెరువులో గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో పోలీసులు.. వీరి కోసం ప్రయత్నించగా.. రాత్రి వేళ చెరువులో కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి.

ALSO READ  RBI: ప్రైవేట్ బ్యాంకుల్లో అధిక అట్రిషన్ రేటుపై ఆర్‌బీఐ ఆందోళన

ఉదయం ఎస్సై సాయి కుమార్ మృత దేహాన్ని గుర్తించారు. అతని సెల్ ఫోన్ జేబులోనే ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు మృతదేహాలను పోస్ట్ మార్టం చేసేందుకు తరలించారు. కాగా.. వైద్యుల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. అప్పటి వరకు కేసు గురించి ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. అసలు ముగ్గురు వ్యక్తులు ఒకేసారి ఆచూకీ లేకుండా పోవడం, అందులో ఇద్దరు పోలీసు డిపార్ట్ మెంట్ కు చెందిన వారు కావడంతో.. ఏమై ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *