ACB Case: ఫార్ములా ఈకార్ రేస్ కేసు వ్యవహారంలో ఐఏఎస్ అర్వింద్ కుమార్ బుధవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఈయన ఏ2గా ఉన్నారు. నిధుల బదలాయింపులో ఈయనే కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ అధికారిగా ఉన్నప్పుడే ఎఫ్ఈవో (ఫార్ములా ఈ ఆపరేషన్స్) కు అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులను బదిలీ చేయించినట్టు సమాచారం.
ACB Case: ఇదిలా ఉండగా, అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే తాను నిధులు బదలాయించినట్టు ఇప్పటికే ప్రభుత్వానికి అర్వింద్ కుమార్ వివరణ కూడా ఇచ్చారు. ఏసీబీ విచారణ సమయంలో ఆయన వివరణను అధికారులు రికార్డు చేయనున్నారు. ఇదేరోజు ఈ కేసు విచారణ కోసం హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. రేపు గురువారం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు.