Naveen Yerneni

Naveen Yerneni: అగ్ర నిర్మాతగా ఎదిగిన నవీన్ ఎర్నేని!

Naveen Yerneni: నవంబర్ 21న ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని పుట్టిన రోజు జరుపుకున్నారు. అదే రోజున ఆయన బ్యానర్ లో కొత్త సినిమా మొదలైంది. అలానే క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘పుష్ప-2’కి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఇదిలా ఉంటే… 2015లో ‘శ్రీమంతుడు’తో నిర్మాతగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నవీన్ ఎర్నేని ఇప్పుడు దాదాపు డజను చిత్రాలను నిర్మిస్తున్నారు. ‘పుష్ప -2, రాబిన్ హుడ్’ చిత్రాలు డిసెంబర్ లో రాబోతున్నాయి. అలానే ”ఉస్తాద్ భగత్ సింగ్, జై హనుమాన్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్, ఎనిమిది వసంతాలు” చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ, ప్రభాస్ – హను రాఘవపూడి చిత్రం, రామ్ చరణ్ 16వ సినిమా, రామ్ పోతినేని 22వ చిత్రం జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తున్న నిర్మాత మరొకరు లేరు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Udvegam: కోర్టు డ్రామా గా 'ఉద్వేగం'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *