AP News: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన వైసీపీకి.. అనంతర పరిణామాలు కూడా దెబ్బమీద దెబ్బ కొడుతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆపార్టీకి దూరమవగా, తాజాగా మరో ఎమ్మెల్సీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవితోపాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ మోషేను రాజుకు వెంకటరమణ తన రాజీనామా లేఖను పంపారు.