Akhanda 2

Akhanda 2: బాలయ్య ‘అఖండ 2’లో సరికొత్త ట్విస్ట్‌తో మాస్ ఫీస్ట్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. ఈ మాస్ సీక్వెల్‌పై అభిమానుల్లో అపారమైన ఉత్సాహం నెలకొంది. బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని ఇప్పటివరకు తెలిసిన విషయమే.

అయితే, బోయపాటి ఓ ఆసక్తికరమైన ప్లాన్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమాలో బాలయ్య మూడో లుక్‌లోనూ సందడి చేయనున్నారని సమాచారం. ఈ లుక్ కూడా ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వనుందని టాక్.

Also Read: SSMB29లో మరో టాప్ బ్యూటీ?

Akhanda 2: ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ జూన్‌లో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్నాయని తెలుస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండగా, 14 రీల్స్ బ్యానర్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. మొత్తంగా, ‘అఖండ 2’ అభిమానులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ లుక్‌లు ఎప్పుడు రివీల్ అవుతాయో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Adnan Sami: అద్నాన్ సమి సంచలన వ్యాఖ్యలు పాక్ ఆర్మీపై యువత ఆగ్రహం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *