Telangana

Telangana: క్రికెట్ ఆడుతూ విజయ్‌ అనే యువకుడు గుండెపోటుతో మృతి

Telangana: రోజు రోజుకీ గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి.. ఆ వయస్సు..ఈ వయస్సు అనే తేడా లేకుండా..చిన్న పిల్లలు నుంచి పెద్ద వయస్సు వరకు హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఉరుకుల పరుగుల జీవితం, స్ట్రెస్, వర్క్ లోడ్, ఆహారపు అలవాట్లు… ఇవ్వన్నీ గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అప్పటి వరకు హుషారుగా పని చేస్తూ..అందరితో కలివిడిగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

తాజాగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ విజయ్ అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు.తోటి ఫ్రెండ్స్ తో సరదాగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు విజయ్. ఏమి జరిగిందో తెలియక ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. ఆస్పత్రికి తరలించేసరికే మృతిచెందాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూసుమంచిలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా విజయ్ కుప్పకూలిపోయాడు.

అక్కడ ఉన్న వారు వెంటనే అతన్ని ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ కుటుంబం ఇరవై సంవత్సరాల క్రితం చెన్నై నుంచి వ్యాపార నిమిత్తం వచ్చి కూసుమంచిలో స్థిరపడ్డారు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన విజయ్ గుండెపోటుతో మృతి చెందడంతో తోటి మిత్రులు విషాదంలో మునిగిపోయారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Breaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *