Amaravati: లక్ష కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ కేబినెట్

Amaravati: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం సమావేశమైంది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగి, సుమారు 70 అజెండా అంశాలపై చర్చ జరిగింది.

కేబినెట్ రాష్ట్ర అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

ముఖ్య నిర్ణయాలు

క్వాంటమ్ కంప్యూటరింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం.ఏపీ నైబర్‌హుడ్ పాలసీ (AP Neighbourhood Policy)కి గ్రీన్ సిగ్నల్.రాష్ట్రంలోని ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం.

విశాఖపట్నం ఐటీ హబ్‌గా అభివృద్ధి దిశగా పలు నిర్ణయాలు.క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ఐటీ క్యాంపస్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయింపు.ఫ్య్లూయెంట్‌గ్రిడ్ ఐటీ క్యాంపస్‌కు 3.3 ఎకరాల భూమి కేటాయింపు.విశాఖలో ఐటీ కంపెనీలకు రోడ్డు విస్తరణకు ఆమోదం.

సీఎం సూచనలు:సీఎం చంద్రబాబు పేదలకు ఇళ్లు కేటాయింపు విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి, అందరికీ ఇళ్లు దక్కేలా చూడాలని ఆదేశించారు.అదేవిధంగా, ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *