Tirumala: ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌తో మోసాలు – భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిక

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. టీటీడీ ఈఓ జె. శ్యామలారావు పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్ అకౌంట్ సృష్టించబడిందని గుర్తించామని సంస్థ పేర్కొంది. ఆ అకౌంట్‌ ద్వారా కొందరు మోసగాళ్లు భక్తులకు డబ్బులు ఇవ్వాలని సందేశాలు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులు ఇలాంటి సందేశాలను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. ఇటువంటి నకిలీ అకౌంట్ల గురించి తెలియజేయడానికి అధికార నంబర్లు కూడా విడుదల చేసింది. ఎవరైనా అనుమానాస్పద మెసేజ్‌లు పొందితే వెంటనే టీటీడీ విజిలెన్స్ నంబర్ 98668 98630 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4141కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.

అదేవిధంగా, భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వచ్చే సమాచారం పైనే నమ్మకాన్ని ఉంచాలని, ఇతర సమాచారం పట్ల సందేహంతో వ్యవహరించాలని టీటీడీ స్పష్టం చేసింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *