Crime News

Crime News: అర్ధరాత్రి నమ్మి వెళ్తే మర్మాంగాలు నలిపేసి చంపిన స్నేహితులు!

Crime News: ఫ్రెండ్స్ కదా అని నమ్మి అర్ధరాత్రి వేళ బయటకు వెళ్లిన ఓ యువకుడు శవమై తిరిగొచ్చాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ మర్డర్‌కు గంజాయి బిజినెస్ గొడవలతో పాటు ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ వివాదమే కారణమని తేలింది. ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్లో ఒకరిని విచారించడంతో నమ్మలేని విషయాలు బయటపడ్డాయి.

హత్యకు గురైన యువకుడి పేరు నిషాని సుహాస్ (22). రంగారెడ్డి జిల్లా పసుమాములలో తల్లి నందినితో కలిసి ఉండేవాడు. సుహాస్‌కు గంజాయి తాగే అలవాటుతో పాటు ఆ దందాలో అనుభవం కూడా ఉంది. కొడుకు పక్కదారి పడుతున్నాడని గమనించిన తల్లి, అతడిని మార్చాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ నుంచి పసుమాములకు ఇల్లు మార్చింది. భర్త చనిపోయినా ఎంతో కష్టపడి కూతురి పెళ్లి చేసి, కొడుకే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లికి చివరికి కడుపుకోత మిగిలింది.

సుహాస్‌కు రాకేష్, పరశురాం, రాజు అనే స్నేహితులు ఉన్నారు. సుహాస్ దగ్గర మొబైల్ లేకపోవడంతో తన ఫ్రెండ్ ఫోన్ వాడుతుండేవాడు. అయితే, ఆ ఫోన్ ఇచ్చిన ఫ్రెండ్ లవర్‌తో సుహాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమెకు ఫోన్ చేసి కూడా తప్పుగా మాట్లాడటంతో ఆ అమ్మాయి ఈ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పింది. దీనికి తోడు పాత గంజాయి బిజినెస్‌కు సంబంధించిన పైసల గొడవలు కూడా ఉండటంతో ఆ స్నేహితుడు సుహాస్‌పై పగ పెంచుకున్నాడు.

ఎలాగైనా సుహాస్ కథ ముగించాలని ఆ నలుగురు స్నేహితులు స్కెచ్ వేశారు. బుధవారం తెల్లవారుజామున పరశురాం ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నుంచి సుహాస్ తల్లి ఫోన్‌కు ఆడియో కాల్ చేశారు. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లారు. వచ్చినవాళ్లు కొడుకు దోస్తే కదా అని తల్లి వారించినా వినకుండా సుహాస్ వాళ్లతో కలిసి బయటకు వెళ్లాడు. వాళ్లంతా కలిసి సుహాస్‌ను పసుమాముల ఊరి చివరన ఉన్న మర్రిచెట్టు దగ్గరకు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

వారి నుంచి తప్పించుకుని సుహాస్ ప్రాణభయంతో అర కిలోమీటరు దూరం పరిగెత్తినా.. స్నేహితులు అని కూడా చూడకుండా వెంటపడి మరీ పట్టుకున్నారు. సుహాస్ మర్మాంగాలను నలిపేసి, ప్రాణం పోయే వరకు దారుణంగా బాదారు. ఆ తర్వాత శవాన్ని పెద్ద అంబర్‌పేట్ రోడ్డులోని శ్మశాన వాటిక గోడ పక్కన ఉన్న సిమెంట్ బెంచీపై పడేసి పారిపోయారు. చెడు తిరుగుళ్లు, పద్ధతి లేని దోస్తులతో తిరగడం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని సుహాస్ తల్లి కన్నీరుమున్నీరుగా ఏడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *