KTR: ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు), ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ప్రజల సంపదని, వాటిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ఐడీబీఐ (IDBI) బ్యాంకు ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ చేస్తున్న పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై స్పందిస్తూ, బ్యాంకు విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే నివేదికలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన పలు కీలక ప్రశ్నలను సంధించారు.
విలువ తక్కువ చేసి ఎందుకు అమ్ముతున్నారు? కేటీఆర్ సూటి ప్రశ్నలు!
-
నిబంధనలు ఎందుకు మార్చారు?: బిడ్‌లు రిజర్వ్ ధర కంటే తక్కువకు పడిపోయినప్పుడు, విలువ నిర్ధారణ (Valuation) పద్ధతులను, నిబంధనలను ఎందుకు మార్చాల్సి వచ్చింది?
-
హైదరాబాద్ స్థిరాస్తుల విలువ లెక్కించారా?: కేవలం వ్యాపార లావాదేవీలే కాకుండా, హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ప్రైమ్ ల్యాండ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఐడీబీఐ బ్యాంకుకు వేల కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. మరి వాటి మార్కెట్ విలువను సరిగ్గా లెక్కగట్టారా లేదా?
-
ఉద్యోగుల ఆందోళనలపై మౌనం ఎందుకు?: ఉద్యోగ భద్రత, బ్యాంకు భవిష్యత్తుపై వేలాది మంది ఐడీబీఐ ఉద్యోగులు నిరసనలు తెలుపుతుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? వారి డిమాండ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?
-
అంత తొందర ఎందుకు?: ఒక ప్రతిష్టాత్మక పబ్లిక్ సెక్టార్ బ్యాంకును కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్రానికి ఎందుకంత తొందర? దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తు విషయంలో పారదర్శకత ఎందుకు పాటించడం లేదు?
పీఎస్‌యూలు జాతి సంపద.. ప్రైవేటీకరణపై పోరు తప్పదు!
PSUs and Public Sector Banks are national assets that need to be safeguarded
Reports about under valuation of IDBI bank are really concerning. Why were the rules and valuation methodology changed when bids fell below the reserve price?
IDBI also owns valuable real estate assets, including prime land in Hyderabad. Has their value been properly accounted for?
Why are the concerns raised by the IDBI employees not being addressed?
Before selling off a reputed public sector bank to a private player, the union government owes the country some straight answers
What’s the hurry ?
— KTR (@KTRBRS) October 31, 2026
