Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు తీస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వేదికగా గ్రామాల్లో నవోదయానికి నాంది పలుకుతూ ఏకంగా రూ.11,085 కోట్ల నిధులతో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని సీఎం ఘనంగా ప్రారంభించారు. తన సుదీర్ఘ అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్సాహం, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఏపీలో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల కంటే ప్రస్తుతం ప్రజల్లో కూటమి పట్ల మరింత భారీ హవా కనిపిస్తోందని, రాబోయే స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు – పంచాయతీరాజ్‌లో విప్లవాత్మక మార్పులు..
-
మహిళలకు భరోసా: తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.
-
రైతులు & పేదల సంక్షేమం: అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం పెడుతున్నాం. చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఆక్వా రైతులకు అండగా నిలిచాం.
-
ఇళ్ల పట్టాలు & నిర్మాణం: ‘మీ ఇల్లు మీ హక్కు’ కింద పేదలకు పట్టాలు ఇవ్వడంతో పాటు త్వరలోనే మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నాం.
రెండేళ్లలో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు – వెలిగొండ పూర్తి..
“వెలిగొండ ప్రాజెక్టును నేనే ప్రారంభించాను.. నేనే పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చాను. వెలిగొండ నుంచి నల్లమలసాగర్‌కు నీటిని తరలించాం. త్వరలోనే ఫేజ్-2 పనులను కూడా పూర్తి చేసి మార్కాపురం ప్రాంతంతో పాటు ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ.. తాగునీటి ఎద్దడి రాకుండా, పశువుల మేత కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
