Kalvakuntla Kavitha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమే తప్ప చేతల్లో శూన్యమని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ ఫామ్‌హౌస్ వివాదం పేరిట సరికొత్త డ్రామాలు ఆడుతున్నారని, అంతర్గతంగా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఫామ్‌హౌస్‌లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఖైరతాబాద్ ఉపఎన్నికలో తెలంగాణ రక్షణ సేన 100 శాతం బరిలోకి దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో తెలంగాణ రక్షణ సేన..
-
3,853 మంది చిన్నారుల మృతి..ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఘటన తర్వాత వెలుగుచూసిన సమాచారం దిగ్భ్రాంతికి గురిచేసిందని, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ వివిధ కారణాలతో ఏకంగా 3,853 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇది ఒక్క జిల్లాకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే దారుణ పరిస్థితి నెలకొందని విమర్శించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి స్వయంగా ఆసుపత్రులను సందర్శించినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
-
నిలోఫర్‌లో 200 శాతం ఆక్యుపెన్సీ..జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రుల నుంచి చిన్నపిల్లలను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని, అక్కడ 200 శాతానికి పైగా బెడ్ ఆక్యుపెన్సీ ఉండటంతో చిన్నారులకు కనీసం అడ్మిషన్లు, బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
నిమ్స్‌లో సీఎంవో ఫోన్ వస్తేనే బెడ్లు దొరుకుతున్నాయి..
-
సామాన్యులకు అందని వైద్యం:ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పే నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి సిఫార్సు ఫోన్ వస్తే తప్ప రోగులకు బెడ్లు దొరకడం లేదని, చివరికి వైద్య మంత్రి చెప్పినా పడకలు దొరకని దుస్థితి నెలకొందని ఆరోపించారు.
-
ఆక్సిజన్ బెడ్ల కోసం రోజుల తరబడి నిరీక్షణ:సాధారణ నిరుపేద రోగికి అత్యవసరంగా ఆక్సిజన్ బెడ్ కావాలంటే 4 నుంచి 7 రోజులు ఎదురుచూడాల్సి వస్తోందని వాపోయారు.
-
సర్జరీలకు నెలల తరబడి నిరీక్షణ:
న్యూరాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో శస్త్రచికిత్సల కోసం రోగులు 4 నుంచి 7 నెలల పాటు వేచి ఉండాల్సి వస్తోందని, ఇక నెఫ్రాలజీ విభాగంలో రోగులను వీల్ చైర్లలో కూర్చోబెట్టే చికిత్స అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై రేవంత్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని కవిత ప్రశ్నించారు.
#TelanganaRakshanaSena (#TRS ) to contest Khairatabad by-election in Hyderabad.@TRSparty_HQ president @RaoKavitha announces the party’s decision to enter the #electoralfray in the upcoming Khairatabad #bypoll.#BreakingNews #Khairatabad #KhairatabadByElection… pic.twitter.com/BzHcz3JuzO
— NewsMeter (@NewsMeter_In) September 26, 2026
