Sunil Yadav: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన విచారణలో కీలక పురోగతి లభించింది. ఈ హత్య వెనుక భారీ ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. కేసులో కీలక నిందితుడైన సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా విచారించింది. రెండో రోజు సుమారు 4 గంటల పాటు సాగిన ఈ విచారణలో సునీల్ యాదవ్ అధికారుల ఎదుట సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
హత్య సమయంలో నేను స్పాట్లోనే ఉన్నా.. సునీల్ యాదవ్ వాంగ్మూలం
సునీల్ యాదవ్ ఇచ్చిన వాంగ్మూలం, ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఈ కేసుతో ప్రమేయమున్న మరికొందరు కీలక రాజకీయ ప్రముఖులకు త్వరలోనే ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
