PM Modi: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY)’ విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2018 సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా చేరువ చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఈ చారిత్రక మైలురాయి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పథకం సాధించిన అద్భుత విజయాలను పంచుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ స్కీమ్.. ప్రధాని మోదీ
ప్రాథమిక స్థాయిలోనే రోగాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వ్యాధుల కోసం 42 కోట్లకు పైగా స్క్రీనింగ్‌లు నిర్వహించారు. అలాగే నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు కోట్ల సంఖ్యలో పరీక్షలు చేపట్టారు. డిజిటల్ మిషన్ (ABDM), హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లతో అనుసంధానమై సామాన్యుడి ప్రాణాలకు భరోసాగా ఆయుష్మాన్ భారత్ నిలుస్తోంది.
Eight years ago, Ayushman Bharat was rolled out with the idea that every Indian should have access to top-quality and affordable healthcare.
Today, more than 60 crore beneficiaries have access to Rs. 5 lakh annual health cover, making it the largest healthcare scheme in the… https://t.co/K7bWTRNlLM
— Narendra Modi (@narendramodi) September 23, 2026
