AP News

AP News: మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఫేక్ వేషాలు.. శాప్ అధికారులపైనే విషం చిమ్ముతారా?

AP News: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ రాజకీయ కుట్రలకు తెరలేపిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. స్పోర్ట్స్ కోటా ధ్రువపత్రాల పరిశీలనలో వాస్తవాలను వెలికితీసి అక్రమార్కుల బండారాన్ని బయటపెట్టిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్ – SAAP) అధికారులను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ నేతలు బరితెగించి దాడులకు, ఆందోళనలకు దిగుతున్నారని టీడీపీ విమర్శించింది.
అవగాహన లేని వారితో ఆందోళనలు..

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద నిరసనల పేరిట అలజడి సృష్టించేందుకు వైకాపా నేతలు శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి అమాయక ప్రజలను తీసుకొచ్చారని విమర్శించారు. కనీసం మెగా డీఎస్సీ అంటే ఏమిటో, అక్కడ ఏం అన్యాయం జరిగిందో కూడా తెలియని వారి చేత నినాదాలు చేయిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

శాప్ ఎండీ భరణిని టార్గెట్ చేయడంపై ఆగ్రహం..
నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న శాప్ ఎండీ భరణిపై బురదజల్లుతూ, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు వైఎస్సార్‌సీపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.

 

16 వేల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం..

గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను పూర్తి పారదర్శకంగా భర్తీ చేస్తుంటే ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలైన క్రీడాకారులకే న్యాయం..

బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కొట్టేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి, మైదానాల్లో కష్టపడి మెడల్స్ సాధించిన నిజమైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటే వైఎస్సార్‌సీపీ ఓర్వలేకపోతోందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *