Vasundhara Devi

Vasundhara Devi: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వర్ణ రథయాత్రలో పాల్గొన్న నందమూరి వసుంధర దేవి

Vasundhara Devi: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు ఆదివారం నిర్వహించిన అత్యంత విశిష్టమైన స్వర్ణ రథోత్సవంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సతీమణి శ్రీమతి నందమూరి వసుంధర దేవి పాల్గొన్నారు. స్వర్ణ రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు.

ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ మర్యాదపూర్వక భేటీ..

  • ఆశీర్వాదం – అభినందనలు..
    ఈ రథయాత్ర సందర్భంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఛైర్మన్ శ్రీ బి. శ్రీధర్ వర్మ, శ్రీమతి వసుంధర గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మకు వసుంధర దేవి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపి, ఆయనకు అభినందనలు అందజేశారు.
  • కుటుంబ యోగక్షేమాలపై ఆరా..

    శ్రీధర్ వర్మ ఆమెతో కాసేపు మాట్లాడి నందమూరి కుటుంబ యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు నందమూరి కుటుంబానికి ఎల్లవేళలా సంపూర్ణంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *