Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) తన సుదీర్ఘ వాణిజ్య ప్రయాణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా తాను స్వయంగా నిర్మించి, ప్రపంచ స్థాయి సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన బెర్క్‌షైర్ హాత్వే (Berkshire Hathaway) సంస్థ ఛైర్మన్ పదవి నుంచి ఆయన వైదొలిగారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే కంపెనీతో ఆయన అనుబంధం పూర్తిగా తెగిపోలేదని, ఇకపై ‘ఛైర్మన్ ఎమెరిటస్’ (Chairman Emeritus) హోదాలో కొనసాగుతూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా తన అపారమైన అనుభవం, సలహాలతో మార్గదర్శకత్వం అందిస్తారని స్పష్టం చేసింది.
నాయకత్వ మార్పు – సంస్థ కొత్త సారథులు..
హోవార్డ్ బఫెట్ 1999 నుంచి ‘హోవార్డ్ బఫెట్ ఫౌండేషన్’ అధినేతగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, సంక్షోభాల నివారణ కోసం విస్తృతంగా పనిచేస్తున్నారు. ఆకలిపై పోరాటంలో భాగంగా ఐక్యరాజ్యసమితి (UN) వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా దాదాపు పదేళ్ల పాటు అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిన అనుభవం ఆయనకుంది. పలు ప్రముఖ పబ్లిక్, ప్రైవేట్ సంస్థల బోర్డులలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 90 ఏళ్లకు పైబడిన వయసులోనూ విలువ ఆధారిత పెట్టుబడుల (Value Investing) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇన్వెస్టర్లకు రోల్ మోడల్‌గా నిలిచిన వారెన్ బఫెట్.. ఛైర్మన్ బాధ్యతల నుంచి గౌరవప్రదంగా తప్పుకుని, బోర్డు స్థాయి మార్గదర్శకుడిగా కొనసాగడం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
