Janwada Farmhouse: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న జన్వాడ ఫామ్‌హౌస్ వివాదంపై ఆ ఆస్తి యజమాని ప్రదీప్ రెడ్డి అధికారికంగా స్పష్టతనిచ్చారు. జన్వాడలోని ఫామ్‌హౌస్, ఆ భూమి పూర్తిగా తన సొంత ఆస్తి అని, దానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడని, ఆ చనువుతోనే తన సొంత ప్రాపర్టీని ఆయనకు లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తారన్న ప్రచారం, పరిశీలనకు వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2019లో కొనుగోలు చేశా – లీగల్ టైటిల్ నా పేరిటే ఉంది..
తాను 2019లోనే ఈ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఈ భూములకు సంబంధించి ఎలాంటి భూవివాదాలు లేవని, చట్టబద్ధమైన స్పష్టమైన లీగల్ టైటిల్ డాక్యుమెంట్లు తన పేరిట ఉన్నాయని స్పష్టం చేశారు. కేటీఆర్ కేవలం లీజుదారుడు మాత్రమేనని వివరించారు.
నోటీసులు ఇస్తే అధికారులకు పత్రాలు ఇస్తా..
జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే..!
కేటీఆర్‌కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు.
– ప్రదీప్ రెడ్డి
జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం, రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టత..
జన్వాడ ఫార్మ్ హౌస్ ఉన్న భూమి నా… pic.twitter.com/v3P7lFQF2y
— Telugu Reporter (@TeluguReporter_) September 18, 2026
