Bipasha Basu: ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ప్రముఖ నటి బిపాసా బసుకు ఊహించని షాక్ తగిలింది. ఆమె కొనుగోలు చేసిన ఒక ప్రముఖ బ్రాండ్ ప్రొటీన్ పౌడర్ డబ్బాలో చిన్న చిన్న పురుగులు కనిపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండే దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో మార్కెట్లో లభించే ప్రముఖ బ్రాండ్ల హెల్త్ సప్లిమెంట్ల నాణ్యతపై నెటిజన్లలో తీవ్ర ఆందోళన మొదలైంది.
డబ్బా మొత్తం పురుగులే.. బిపాసా వీడియో వైరల్
తాజాగా కొనుగోలు చేసిన ‘ఇసోప్యూర్’ (Isopure) ప్రొటీన్ పౌడర్ డబ్బాను తెరవగానే అందులో పురుగులు కనిపించాయని బిపాసా తెలిపారు. తన వేలి కొనపై ఉన్న చిన్న పురుగును, గ్లాసులోని పౌడర్‌లో తేలుతున్న కీటకాలను జూమ్ చేసి చూపిస్తూ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.
తుకారాం ముండేపై బాలీవుడ్ సెలబ్రిటీల నమ్మకం..
2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్న బిపాసాకు 2022లో కుమార్తె దేవి జన్మించింది. కుటుంబానికే ప్రాధాన్యతనిస్తూ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, చివరిగా 2020లో ‘డేంజరస్’ వెబ్ సిరీస్‌లో కనిపించారు. ప్రస్తుతం దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న ‘బరాబంకి’ అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రొటీన్ సప్లిమెంట్లు కొనుగోలు చేసే వినియోగదారులు సీల్, బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ డేట్లను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
