Chandrababu: కలెక్టర్ల సదస్సును కేవలం ఒక లాంఛనంగా కాకుండా, ఫలితాలు సాధించే వేదికగా మార్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనలు, డిజిటల్ గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ముఖ్యమైన నిర్ణయాలు & ఆదేశాలు
-
ఫీల్డ్ విజిట్లపై అసంతృప్తి: క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్లని కలెక్టర్ల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 13 మంది కలెక్టర్ల నుంచి ఎలాంటి నివేదికలు అందలేదని ప్రస్తావిస్తూ, వచ్చే సమావేశం నాటికి పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
-
సదస్సు అంటే కాలక్షేపం కాదు: కాన్ఫరెన్స్‌లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో తూచా తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు.
-
100% ఈ-ఆఫీస్ విధానం: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతిక (ఫిజికల్) ఫైళ్లకు తావులేదని, అన్ని శాఖల్లో ఫైళ్ల నిర్వహణ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు.
-
ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం: ప్రజలకు సంబంధించిన ఫైళ్ల పరిష్కారంలో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.
-
ఐఏఎస్ అధికారుల పనితీరుపై నివేదిక: అధికారుల పనితీరును అంచనా వేసేందుకు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి నేరుగా తీసుకునే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే అధికారుల పనితీరును సమీక్షించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
