KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య భూ కేటాయింపులు, అసెంబ్లీ పరిణామాలపై మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్’ (Tesseract) డిఫెన్స్ కంపెనీకి కేటాయించిన భూములను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కిందని, వెయ్యి రోజుల పాలనలో సాధించిందేంటని ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కి సస్పెండ్ చేయించారని మండిపడ్డారు.
రూ.లక్ష పెట్టుబడి ఉన్న షెల్ కంపెనీకి రూ.200 కోట్ల భూములా?
గాంధీల పాలనలో గజానికో గజదొంగ.. గుంటకొక గుంటనక్క..
అక్కపై దాడి జరిగితే తమ్ముడు ఊరుకుంటాడా?
సీఎం రేవంత్ టీమ్ సృష్టించిన నకిలీ ఫేస్బుక్ ఖాతా ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని, ఆ పోస్టు పెట్టిన ‘అంతర్జాతీయ కార్యదర్శి’ ఎవరో ప్రభుత్వం బహిర్గతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ భూదందాలపై కోర్టుకు వెళ్లడంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఊరూరా సదస్సులు పెట్టి ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు.
