Bandi Sanjay: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను బీఆర్ఎస్ నాయకులు అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ జీర్ణించుకోలేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, అసెంబ్లీ గేటు వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌పై హత్యాయత్నమనేది పెద్ద జోక్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక, సర్టిఫికెట్లు చేతికి రాక లక్షలాది మంది విద్యార్థులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతుంటే, ఉద్యోగాలు లేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు మూతపడి నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు శరీరానికి కనీస దెబ్బలు కూడా తగలకపోయినా, ఏదో పెద్ద దాడి జరిగినట్లు నాటకాలు ఆడుతూ నటన ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాబోయేది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారే
కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, దోపిడీ, పరస్పర డ్రామాలను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని.. త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, ‘డబుల్ ఇంజిన్’ సర్కారుతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్ తేల్చిచెప్పారు.
