Crime News

Crime News: కదిలే బస్సులో 16 ఏళ్ల బాలికపై ఘాతుకం.. డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!

Crime News: దేశ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోని నోయిడాలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. సహాయం కోసం చూస్తున్న 16 ఏళ్ల బాలికను నమ్మించి, కదిలే స్లీపర్ బస్సులో దారుణానికి ఒడిగట్టారు. ఆగస్టు 4న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది?..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబసభ్యులతో జరిగిన చిన్న గొడవతో మనస్తాపం చెందిన 16 ఏళ్ల బాలిక ఆగస్టు 4న ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడాలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. ఆ సమయంలో భారీ వర్షం, చీకటి ఉండటంతో దారి తెలియక పొరపాటున ‘పరి చౌక్’ వద్ద బస్సు దిగిపోయింది. ఒంటరిగా నిలబడి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలిక.. వర్క్‌షాప్‌లో రిపేర్లు ముగించుకుని ఖాళీగా తిమర్‌పూర్ వైపు వెళ్తున్న ఓ స్లీపర్ బస్సును సహాయం కోసం ఆపింది. ఆమెను గమ్యస్థానమైన నోయిడా సెక్టార్ 63 వద్ద దింపుతామని బస్సు డ్రైవర్, కండక్టర్ నమ్మబలికి బస్సులోకి ఎక్కించుకున్నారు.

కదిలే బస్సులో అకృత్యం – రోడ్డుపై వదిలేసి పరారీ..

బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత నిందితులు బాలికపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా, ప్రాణాలు తీస్తామని బెదిరించి ఆమెపైన హత్యాచారం చేశారు. స్లీపర్ బస్సు కిటికీలకు తెరలు ఉండటంతో లోపల జరుగుతున్న దారుణం బయటకు తెలియకుండా పోయింది. ఈ ఘాతుకం తర్వాత నిందితులు బాలికను కాశ్మీరీ గేట్ బస్టాండ్ సమీపంలోని రింగ్ రోడ్డుపై దించేసి బస్సుతో సహా అక్కడి నుంచి పారిపోయారు.

నిందితుల అరెస్ట్ – ఫోరెన్సిక్ విచారణ..

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.తిమర్‌పూర్ బస్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకుని, శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *