Chandrababu

Chandrababu: చరిత్ర సృష్టించిన వెలిగొండ ప్రాజెక్ట్.. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలు విడుదల!

Chandrababu: ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. కరువు నేలలను సస్యశ్యామలం చేసే ప్రతిష్టాత్మక పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 (Phase-1) ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మార్కాపురం జిల్లా (ఉమ్మడి ప్రకాశం) దోర్నాల మండలం గంటావానిపల్లి పరిధిలో నిర్వహించిన ఈ చారిత్రక కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొన్నారు. 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తానే శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును.. నేడు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే ప్రారంభించి ప్రారంభోత్సవ పైలాన్‌ను ఆవిష్కరించడం విశేషం.

కృష్ణమ్మకు జలహారతి – నల్లమలసాగర్‌కు నీటి విడుదల:

గంటావానిపల్లి వద్ద కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. వెలిగొండ మొదటి దశ టన్నెల్ ద్వారా నల్లమలసాగర్ జలాశయానికి అధికారికంగా నీటిని విడుదల చేశారు. ఫేజ్-1 పూర్తి కావడానికి గుర్తుగా ఏర్పాటు చేసిన భారీ పైలాన్‌ను మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించారు.

కరువు నేలలకు శాశ్వత జలకళ:

వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ అందుబాటులోకి రావడంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ పీడిత, తీవ్ర కరువు ప్రాంతాలకు సాగు మరియు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *