Yash Mother: ‘టాక్సిక్’ (Toxic) సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో సోషల్ మీడియాలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ స్టార్డమ్పై వస్తున్న విమర్శలకు ఆయన తల్లి ఇచ్చిన ఘాటు సమాధానం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ‘కేజీఎఫ్’ (KGF) ఫ్రాంచైజీకి ముందే యశ్ ప్రస్థానం ఏమిటో తెలుసుకోవాలంటూ ట్రోలర్లతో పాటు గతంలో సినీ వర్గాల్లో వచ్చిన వ్యాఖ్యలకు ఆమె తనదైన శైలిలో గట్టి బదులిచ్చారు.
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగాడు.. యశ్ తల్లి స్పందన..
అల్లు అరవింద్ పాత వ్యాఖ్యలతో ముడిపెడుతున్న నెటిజన్లు..
కానీ అల్లు అరవింద్ ఆ సమాధానం చెప్పడానికి కూడా కారణాలు లేకుండా పోలేదు. ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ని మీరు పెద్ద సినిమాలు చేయకుండా ఉండడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ యశ్ పేరుని ఓ ఉదాహరణగా చెప్పారు. పెద్ద సినిమా చేయాలంటే ఒక స్టార్ హీరోకి బడ్జెట్ లోంచి 25% వరకు ఇవ్వవలసి ఉంటుంది. దీంతో కొన్ని సార్లు సినిమా క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. దానికి బదులుగా కంటెంట్ ఉన్న చిన్న సినిమాని తీసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చేయొచ్చు కదా అంటూ అప్పుడు చెప్పిన ఉదాహరణే యశ్ పేరు. కేజీఎఫ్ కి ముందు యశ్ ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు అందరికీ తెలుసు కదా అని చెప్పారు. ఇప్పుడు తాజాగా టాక్సిక్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ వ్యాఖ్యలను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
