NEET UG Counselling 2026: వైద్య విద్యలో (MBBS, BDS, B.Sc Nursing) చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కీలక అప్డేట్ ఇచ్చింది. నీట్ యూజీ (NEET UG) 2026 మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి మొత్తం సీట్ల వివరాల పట్టికను (Seat Matrix) అధికారికంగా విడుదల చేసింది.
దీనితో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైనా పొరపాటు చేసినా, తప్పుడు వివరాలు నమోదు చేసినా సరిదిద్దుకునేందుకు ‘రీసెట్ రిజిస్ట్రేషన్’ (Reset Registration) ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
రీసెట్ ఆప్షన్ గడువు ఎప్పటి వరకు?
ఆన్లైన్ అప్లికేషన్లో కేటగిరీ, పర్సనల్ వివరాలు లేదా కోటా నమోదులో పొరపాట్లు జరిగినట్లయితే విద్యార్థులు ఆగస్టు 12న ఉదయం 11:00 గంటల వరకు మాత్రమే సరిదిద్దుకోవడానికి అవకాశముంది. ఆ తర్వాత మార్పులకు ఎలాంటి అనుమతి ఉండదని ఎంసీసీ స్పష్టం చేసింది.
ఫస్ట్ ఫేజ్ సీట్ల వివరాలు (Round 1 Seat Matrix)..
మొదటి విడత కౌన్సెలింగ్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 31,728 సీట్లను అందుబాటులో ఉంచారు..
-
MBBS సీట్లు: 27,292
-
BDS (డెంటల్) సీట్లు: 4,068
-
B.Sc నర్సింగ్ సీట్లు: 368
ఈ సీట్ల వివరాల్లో కళాశాలల వారీగా, ఆల్ ఇండియా కోటా, ఎన్ఆర్ఐ, ఈఎస్ఐ కోటాలతో పాటు బిసి, ఇడబ్ల్యూఎస్, ఓపెన్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా స్పష్టమైన గణాంకాలను పొందుపరిచారు.
ముఖ్యమైన తేదీలు & షెడ్యూల్..
-
రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు గడువు: ఆగస్టు 12, మధ్యాహ్నం 3:00 గంటల వరకు
-
చాయిస్ ఫిల్లింగ్ (ఆప్షన్ల నమోదు): ఆగస్టు 13, ఉదయం 11:00 గంటల వరకు
-
చాయిస్ లాకింగ్: ఆగస్టు 12 సాయంత్రం 4:00 గంటల నుంచి ప్రారంభం
-
ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలు: ఆగస్టు 17న విడుదల
-
కాలేజీల్లో రిపోర్టింగ్: ఆగస్టు 18 నుండి 22 వరకు
విద్యార్థులు ఆప్షన్లు ఎంచుకునే ముందు అధికారిక వెబ్సైట్ mcc.nic.in లోని సీట్ మ్యాట్రిక్స్‌ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాధాన్యతల క్రమాన్ని నిర్ణయించుకోవాలని అధికారులు సూచించారు.

