Srinivasa Mangapuram Review: తెలుగు ఇండస్ట్రీలో ‘ఘట్టమనేని’ కుటుంబానికి సాప్రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని టాలీవుడ్‌కి పరిచయమైంది.
మోహన్ బాబు, నరేష్, కిక్ శ్యామ్ లాంటి అనుభవజ్ఞులైన నటీనటులతో రూపొందిన ఈ మాస్ యాక్షన్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం!
కథేంటంటే?
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి శ్రీనివాస్ అలియాస్ శ్రీను (జై కృష్ణ) కొత్తగా వస్తాడు. అక్కడ స్థానికంగా అందరినీ భయపెట్టే పెద్దిరెడ్డి (‘కిక్’ శ్యామ్) కూతురు మంగ (రాషా తడాని)ని చూడగానే శ్రీను ప్రేమలో పడతాడు. నరేష్ (స్వతంత్ర బాబు) సహాయంతో మంగ చుట్టూ తిరుగుతూ ఆమె ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు.
అయితే, మంగకు అప్పటికే ఎంగేజ్‌మెంట్ ఖాయమవుతుంది. అయినా సరే శ్రీను ఆమె వెంటే ఉంటాడు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి సోదరి వరలక్ష్మి (వాసుకి) తిరుపతికి వచ్చి శ్రీనును ‘వాసు బాబు’ అని పిలుస్తూ మంగను వదిలేయమని హెచ్చరిస్తుంది. అసలు శ్రీను తిరుపతికి ఎందుకు వచ్చాడు? అతనికి బళ్లారి డాన్ వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు మంగ, శ్రీను ఎలా ఒకటయ్యారు? అనేది మిగతా కథ!
విశ్లేషణ:
కొత్త గా నటీనటులను పరిచయం చేసేటప్పుడు సాధారణంగా దర్శకులు సేఫ్ గేమ్ ఆడేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అజయ్ భూపతి కూడా అదే ఫార్ములాను నమ్ముకుని పక్క కమర్షియల్ సినిమా తెరకెక్కించారు.
-
ప్రథమార్థం (First Half): విలన్ రౌడీయిజం ఎలివేషన్లు, హీరోయిన్ వెనక హీరో పడటం, మధ్యలో సంబంధం లేకుండా మొదటి 40 నిమిషాల్లోనే మూడు పాటలు రావడం కాస్త చిరాకు తెప్పించిన నరేష్ ఇంకా బ్రహ్మాజీల కామెడీ మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అనుకుంటే అది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎపుడెపుడు ఇంటర్వెల్ వస్తుందా అని ఎదురు చుసిన ఆడియన్సు కి ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై కొంత ఆసక్తిని పెంచుతుంది.
-
ద్వితీయార్థం (Second Half): హీరో గురించి చెప్పే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ కొంత మేరకు బాగానే ఉన్న అయితే, రొటీన్ మాస్ టెంప్లేట్ కావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు సులభంగా ఊహించగలుగుతాడు అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్ ఉంటుంది.
నటీనటులు & సాంకేతిక వర్గం:
-
జై కృష్ణ: ఘట్టమనేని వారసుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి ఈజ్ చూపించాడు. డాన్సులు, యాక్షన్ సీన్స్‌లో మెప్పించాడు. కొన్ని యాంగిల్స్‌లో మహేశ్ బాబు ఛాయలు కనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లలో ఇంకాస్త అనుభవం రావాల్సి ఉంది. కానీ సినిమాలో తనని చేస్తునంత సేపు ఇది తన ఫస్ట్ సినిమా లాగా అసలు కనిపియ్యదు.
-
రాషా తడాని: తన పరిధి మేరకు గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది.
-
ఇతర పాత్రలు: దర్శకుడు అజయ్ భూపతి మోహన్ బాబుని ఈ సినిమాలో సరిగా వాడుకోలేకపోయారని చెప్పొచ్చు. ఆయన కనిపించేది కాసేపే అయినా తన సీనియారిటీతో స్క్రీన్‌ను డామినేట్ చేశారు. ఇక కిక్ శ్యామ్, వాసుకి, నరేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
-
సాంకేతికంగా: జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జయకృష్ణ గుమ్మడి కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.
ముగింపు:
ఘట్టమనేని కుటుంబం నుంచి ఒక హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ లో ముందు నుంచే కొంత హైప్ ఉంటుంది. ఆ హైప్‌ని అందుకోవడంలో అజయ్ భూపతి ఫెయిలయ్యారు అని చెప్పొచ్చు. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా కొత్త కథ కాకపోయినా స్క్రీన్‌ప్లేతో కూడా ఆకట్టుకోలేకపోయారు. కొత్త హీరో లాంచింగ్‌కు కావలసిన అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్న రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు.
