CJP: నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో జరగనున్న మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన పట్టును మరింత బిగించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించడం లేదా ఆయన రాజీనామా చేయడం తప్ప మరొక దానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది.
1. మంత్రి రాజీనామాపైనే సీజేపీ పట్టు
విద్యాశాఖ మంత్రి రాజీనామాపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే శనివారం జరిగే మూడో విడత చర్చల్లో కొనసాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా స్పష్టం చేశారు.
ఎన్టీఏ (NTA)లో 47 మంది అధికారులను తొలగించినా, విద్యాశాఖ కార్యదర్శిని మార్చినా సరిపోదని.. ఈ లీకేజీలకు, విద్యార్థుల ఆవేదనకు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధానే రాజకీయ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
2. రెండు డిమాండ్లకు ఓకే.. రాజీనామాపై పెండింగ్!
శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన రెండో విడత చర్చల్లో సీజేపీ తెలిపిన వివరాల ప్రకారం.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది.
నీట్ వివాదంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.మంత్రి రాజీనామాపై మాత్రం నిర్ణయం చెప్పడానికి కేంద్రం శనివారం వరకు గడువు కోరింది.
3. కేంద్రం స్పష్టత: “రాజీనామా చేసే ప్రసక్తే లేదు”
మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. ప్రభుత్వం ఆయనకు పూర్తిగా అండగా నిలుస్తుందని, రాజీనామాతో సమస్య తీరదని పేర్కొన్నాయి.
ఇదే సమయంలో లీకేజీలను అరికట్టేందుకు..
కేసుల వేగవంతమైన విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
పేపర్ లీక్ నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
