Lenin Movie Trailer

Lenin Movie Trailer: అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ డేట్ ఫిక్స్!

Lenin Movie Trailer: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకుంటూ ప్రేక్షకులు మరియు అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా వచ్చే నెల జూలై 10న థియేటర్లలోకి రానుంది. ఈ తరుణంలో సినిమా ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ‘లెనిన్’ అఫీషియల్ ట్రైలర్‌ను జూన్ 30న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

గతంలో ‘వినరో భాగ్యం విష్ణు కథ’ చిత్రంతో ప్రామిసింగ్ హిట్ అందుకున్న మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా పల్లెటూరి వాతావరణం, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ కలయికతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రాగా.. రాబోయే ట్రైలర్ సినిమాపై అంచనాలను డబుల్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ కోసం అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ రగ్గడ్ లుక్‌లోకి మారిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ యాక్షన్ డ్రామా, ఎట్టకేలకు జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సినిమాలో అఖిల్ సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అటు అక్కినేని నాగార్జున సైతం ‘లెనిన్’ అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నామని, సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని గతంలోనే ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *