Sandeep Reddy Vanga: ‘బాహుబలి’ ఘనవిజయం తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలన్నీ భారీ బడ్జెట్, లార్జర్-ద్యాన్-లైఫ్ బ్యాక్డ్రాప్లతోనే సాగాయి. దీనివల్ల ఆయా సినిమాల డైరెక్టర్స్ ఎక్కువగా గ్రీన్ స్క్రీన్స్, సిజిఐ (CGI), ఇంకా కంట్రోల్డ్ స్టూడియో సెట్లపైనే ఆధారపడ్డారు. భారతదేశంలోని సహజమైన, రా అండ్ అథెంటిక్ లొకేషన్లలో ప్రభాస్ చివరిసారిగా ఎప్పుడు అవుట్డోర్ షూటింగ్లో పాల్గొన్నాడో కూడా గుర్తులేనంతగా ఈ సెట్ల ప్రభావం ఉండిపోయింది. ఆయా కథల డిమాండ్ వల్లే స్టూడియో వాతావరణాన్ని ఎంచుకున్నట్లు మేకర్స్ వాదించినా.. ఈ కృత్రిమ(ఆర్టిఫిషల్) ఎన్విరాన్మెంట్ ప్రభాస్‌కు సహజంగా ఉండే రఫ్ అండ్ రా స్క్రీన్ ప్రెజెన్స్‌ను దెబ్బతీస్తోందంటూ ప్రేక్షకులు, విమర్శకుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
హైదరాబాద్ వీధుల్లో ‘స్పిరిట్’ మంటలు..
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం గత దర్శకులకు భిన్నంగా సరికొత్త మేకింగ్ స్టైల్‌ను చూపిస్తున్నారు. సౌకర్యవంతమైన ఏసీ స్టూడియో బాక్స్ లోపల నగర వాతావరణాన్ని రీ-క్రియేట్ చేయడానికి బదులుగా.. ఆయన ప్రొడక్షన్‌ను నేరుగా హైదరాబాద్ లోని పాతబస్తీ, బిజీ వీధుల్లోకి లాగుతున్నారు.
-
విమల్ థియేటర్ షెడ్యూల్: కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని ఐకానిక్ ‘విమల్ థియేటర్’ పరిసర ప్రాంతాలలో ప్రభాస్‌పై హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లను వంగా షూట్ చేశారు.
-
చంచల్‌గూడ సెంట్రల్ జైలు: అది చాలదన్నట్లు, ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్ జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఒక కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసి చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు అవుట్డోర్ షెడ్యూల్స్ లోనూ ప్రభాస్ స్వయంగా జనం మధ్య పాల్గొనడం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.
రూల్స్ బ్రేక్ చేస్తున్న వంగా: గతంలో ప్రభాస్‌తో పనిచేసిన చాలామంది దర్శకులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ప్రభాస్ సాధారణంగా క్రౌడ్ (జనాలు) తక్కువగా ఉండే ప్రదేశాలలో లేదా స్టూడియో సెట్లలో ప్రశాంతంగా షూటింగ్ చేయడానికి ఇష్టపడతారని వెల్లడించారు. కానీ వంగా మాత్రం ఆ రూల్స్ అన్నింటినీ పక్కనబెట్టేశారు. జనాలు, ట్రాఫిక్ ఉన్నా సరే.. కథలోని ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదనే పట్టుదలతో పబ్లిక్ లొకేషన్లలోనే షూట్ లాగుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా అనుకున్న ఈ రా అండ్ రఫ్ మేకింగ్ విధానాన్ని గనుక స్క్రీన్‌పై పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే.. బాహుబలి మునుపటి ప్రభాస్ వింటేజ్ మాస్ లుక్‌ను థియేటర్లలో చూడటం ఖాయం. ఇది ప్రభాస్‌కు ఒక భారీ బ్లాక్‌బస్టర్ అందించడమే కాకుండా, గత కొంతకాలంగా ఆయన లొకేషన్స్ మరియు లుక్స్ పై వస్తున్న విమర్శలన్నింటికీ శాశ్వతంగా చెక్ పెడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
