Rao Bahadur: 

Rao Bahadur: నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. రిలీజ్ కి ముందే లాభాలు తెస్తున్న సినిమా.. !

Rao Bahadur: ఓ కోతరకమైన కథాంశంతో తెరకెక్కిన ‘రావ్ బహదూర్’ సినిమా విడుదలకు ముందే ఊహించని రేంజ్‌లో బిజినెస్ జరుగుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు రూ. 7 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

ఈ డీల్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా జూలై 3న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటే.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ అదనంగా మరికొంత మొత్తాన్ని మేకర్స్‌కు చెల్లించనుంది. ఈ లెక్కన సినిమా గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే కేవలం ఓటీటీ హక్కుల ద్వారానే సినిమా యూనిట్‌కు రూ. 10 కోట్ల వరకు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

స్టార్ ప్రొడక్షన్ – టెక్నికల్ టీమ్..

కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడు ప్రోత్సహించే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

A+S మూవీస్ ఇంకా శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింత గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సత్యదేవ్ సరసన వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

వెంకటేష్ మహా మార్క్ స్టోరీ టెల్లింగ్, సత్యదేవ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు తోడు మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ తోడవడంతో ‘రావ్ బహదూర్’ బిజినెస్ వర్గాల్లో హాట్ కేకులా మారింది. జూలై 3న విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *