Skywalk

Skywalk: రాయదుర్గం టు టీ హబ్.. 500 మీటర్ల స్కైవాక్, 400 మీటర్ల టన్నెల్ సిద్ధం!

Skywalk: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం మరో భారీ అడుగు వేస్తోంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ (T-Hub) వరకు సరికొత్త స్కైవాక్ (Skywalk) నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల మెట్రోలో వచ్చే వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డు మీద ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా నేరుగా తమ కార్యాలయాలకు చేరుకోవచ్చు.

ఈ స్కైవాక్ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభమై ఐకియా (IKEA) ఫ్లైఓవర్, ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ మీదుగా టీ హబ్ వరకు సాగుతుంది.

  • మొదటి దశ: తొలి విడతలో సుమారు 500 మీటర్ల పొడవైన స్కైవాక్‌ను నిర్మిస్తారు.
  • అండర్‌పాస్ (టన్నెల్): స్కైవాక్‌తో పాటు టీ హబ్ నుంచి మైండ్‌స్పేస్ సి-గేట్ వరకు 400 మీటర్ల పొడవైన అండర్‌పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఇది కూడా చదవండి: Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల 31వ వార్డులో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో పాటు రహేజా మైండ్‌స్పేస్, సత్వ, దివ్యశ్రీ, ఫీనిక్స్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్ నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ద్వారా ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి పంపనున్నారు. భవిష్యత్తులో ఈ స్కైవాక్‌ను మరిన్ని ఐటీ పార్కులకు కనెక్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మరియు టీజీఐఐసీ అధికారులు సంయుక్తంగా ఈ పనులను పర్యవేక్షిస్తారు. ఈ స్కైవాక్ అందుబాటులోకి వస్తే ఐకియా పరిసరాల్లో పాదచారులకు భద్రత పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *