MSVG: విడుదలకు ముందే ‘మన శంకరవరప్రసాద్’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ. 600గా నిర్ణయించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్’. ఇందులో చిరంజీవికి జోడిగా నయనతార నటించగా, వెంకటేష్ గెస్ట్ రోల్లో (కామియో) కనిపించనున్నారు. ఇక విషయానికి వస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, జనవరి 11న ప్రదర్శించబోయే ప్రీమియర్ షోల టికెట్లను రూ. 600కి అమ్ముకోవచ్చు.
ఇది కూడా చదవండి: Toxic: ‘టాక్సిక్’ పై రచ్చ.. మాట తప్పిన యాష్.. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దు
సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ రోజు నుండి వారం రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిన్న (శుక్రవారం) టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. జనవరి 11న పడే ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించింది. ఈ షోలు రాత్రి 8 గంటల నుండి 10 గంటల లోపు ప్రారంభమవుతాయి.
ఇక జనవరి 12 నుండి 10 రోజుల పాటు ఏపీలో సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున (జీఎస్టీతో కలిపి) పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అలాగే విడుదలైన మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించుకోవచ్చని జీవోలో పేర్కొంది.

