Indian Football Team: భారత పుట్ బాల్ టీమ్ ఈ ఏడాది అంతా ఒక్క విజయం కూడా లేకుండా సీజన్ ముగించింది. 2024 సీజన్ లో 11 మ్యాచ్‌లాడిన భారత్ ఆరింటిలో ఓడిపోగా.. 5 మ్యాచ్ లను డ్రా చేసింది. ఈ సీజన్ లో ఆఖరుగా మలేసియాతో గచ్చిబౌలిలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ ను 1-1తో డ్రా గా ముగించింది. భారత్ తరపున 39వ నిమిషంలో రాహుల్ భీకె గోల్ కొట్టగా.. మలేసియా జట్టు తరఫున 19వ నిమిషంలో టర్మర్ పాలో గోల్ కొట్టాడు. మలేసియాతో జరిగిన ఈ పోరు హోరాహోరీగా సాగింది. తొలుత గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ పొరపాటును టర్మర్ పాలో ఉపయోగించుకుని గోల్ కొట్టగా.. అనంతరం డిఫెండర్ రాహుల్ ఫెర్నాండెజ్ నుంచి వచ్చిన పాస్‌ను మెరుపు వేగంతో గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు.
