Danam Nagender: హైదరాబాద్ నగరంలో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఎన్నికల కమిషన్ (EC) వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల తొలగింపుపై ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే, అర్హులైన వారి ఓట్లను వెంటనే పునరుద్ధరించకపోతే.. ఈసీ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరాన్ని తగలబెడతామంటూ అత్యంత వివాదాస్పద హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్లో నిర్వహించిన సీసీ రోడ్ల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
కేవలం ఒక్క డివిజన్‌లోనే 20 వేల ఓట్లు మాయం.. బీజేపీపై ఆరోపణలు..!
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేవలం హిమాయత్‌నగర్ డివిజన్‌లోనే ఏకంగా దాదాపు 20,000 ఓట్లను ఏకపక్షంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000, 2002 సంవత్సరం నుంచి అక్కడే నివాసముంటూ, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటు వేసిన స్థానికుల పేర్లను ఇప్పుడు జాబితా నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.
ఓట్ల తొలగింపు అంశంపై అధికారికంగా ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని, అక్రమంగా ఓట్లు గల్లంతు చేసిన వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని దానం స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి నగరాన్ని తగలబెడతాం అంటూ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తుండటంతో ఈ అంశం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
ఎన్నికల కమిషన్‌పై దానం నాగేందర్ తీవ్ర వ్యాఖ్యలు..!
SIR ప్రక్రియలో తన డివిజన్లో 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్..
ఆ ఓట్లను పునరుద్ధరించకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబడుతుందని వ్యాఖ్యానించారు..#Danamnagender #Telangana pic.twitter.com/QvD6dz1nli— Telugu Stride (@TeluguStride) October 1, 2026
