Supreme Court

Supreme Court: సంచలన తీర్పు.. రోడ్లపై బండి ఆపి మరీ సీజ్ చేయాలని ఆదేశం!

Supreme Court: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ఈ-చలాన్లు పడినా కూడా.. “లైట్లే తర్వాత కడదాంలే” అని లైట్ తీసుకునే వాహనదారులకు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వాహనాలను నేరుగా సీజ్ (స్వాధీనం) చేసుకునే అధికారాన్ని పోలీసులకు కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల చలాన్లు బకాయిలు పేరుకుపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేవలం ఆన్‌లైన్‌లో ఈ-చలాన్లు పంపినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, బకాయిలు వసూలు చేసేందుకు కఠినమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
దేశంలో రూ.23,000 కోట్ల చలాన్లు పెండింగ్!
‘లైవ్ లా’ (Live Law) నివేదిక ప్రకారం.. ‘ఎస్. రాజశేఖరన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు కోరిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం సమర్పించిన డేటా విస్తుపోయేలా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.49,000 కోట్ల విలువైన ఈ-చలాన్లు జారీ అయ్యాయి.
రూ.23 వేల కోట్లు రికవరీ కాలేదు..
ఇందులో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.26,000 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇంకా ఏకంగా రూ.23,000 కోట్ల భారీ మొత్తం పెండింగ్‌లోనే ఉంది. ఇంత భారీగా ఫైన్లు పేరుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేమని, వసూళ్ల కోసం వాహనాలను సీజ్ చేసే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
ఎవరి వాహనాలు సీజ్ చేస్తారు? – రూల్స్ ఏంటి?
కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోలీసులు ఏయే పరిస్థితుల్లో మీ వాహనాన్ని సీజ్ చేస్తారో చూడండి..
  1. పదే పదే చలాన్లు కట్టని వాహనాలు:
    ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తూ చలాన్లు కట్టకుండా తిరుగుతున్నారో.. అంటే ఒకటి కంటే ఎక్కువ ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు.
  2. రోడ్లపై ర్యాండమ్ తనిఖీలు:
    రోడ్లపై తిరిగే వాహనాలను పోలీసులు ఎక్కడైనా ఆపి తనిఖీ (Random Checking) చేయవచ్చు. ఆ తనిఖీల్లో మీ బండి నంబర్‌పై పాత పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలితే.. ఆ బండిని అక్కడికక్కడే సీజ్ చేసే హక్కు పోలీసులకు ఉంటుంది. ఒకవేళ మీ బండి పోలీసుల తనిఖీలకు చిక్కకపోతే మాత్రం సీజ్ చేసే అవకాశం ఉండదు.

ఇంకా ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయి?

కేవలం బండి సీజ్ చేయడమే కాకుండా.. బకాయిలు వసూలు చేసేందుకు ఇతర కఠిన పద్ధతులు కూడా వాడాలని సుప్రీంకోర్టు సూచించింది..
  • ఆన్‌లైన్ సర్వీసులు బంద్: చలాన్లు క్లియర్ చేయకపోతే రవాణా శాఖకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను నిలిపివేయడం.
  • ఓనర్‌షిప్ బదిలీ రద్దు: పాత బండిని వేరే వాళ్లకు అమ్మేటప్పుడు జరిగే ‘ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్’ (Ownership Transfer) ప్రక్రియను నిలిపివేస్తారు.
  • ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ల నిరాకరణ: పెండింగ్ ఫైన్లు ఉంటే ఆ వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (FC) లేదా పొల్యూషన్ (PUC) సర్టిఫికెట్ జారీ చేయరు.
  • బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం: కేంద్ర ప్రభుత్వ ‘పరివాహన్’ (Parivahan) పోర్టల్‌లో ఆ వాహనాన్ని నేరుగా బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతారు.

కాబట్టి మీ టూ-వీలర్ లేదా కార్ నంబర్‌పై ఏవైనా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉంటే వెంటనే చెక్ చేసుకుని కట్టేయడం మంచిది. లేదంటే రోడ్డుపై పోలీసులు ఆపినప్పుడు బండిని పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రమాదం ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *