Arjun Suravaram: ‘కార్తికేయ -2’తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ మూవీ విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తయ్యింది. 2019 నవంబర్ 29న ఈ సినిమా విడుదలైంది. తమిళ చిత్రం ‘కణితన్’ కు ఇది రీమేక్. మాతృకను తెరకెక్కించిన టి.ఎన్. సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసింది. శామ్ సి.ఎస్. సంగీతం అందించారు. నకిలీ సర్టిఫికెట్స్ బండారాన్ని బయటపెట్టే మీడియా రిపోర్టర్ గా ఇందులో నిఖిల్ నటించాడు. కమర్షియల్ గా ‘అర్జున్ సురవరం’ గొప్ప విజయాన్ని అందుకోకపోయినా… విమర్శకుల ప్రశంసలను పొందింది.