YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అమరావతిలో మహిళలను కించపరిచేలా సాక్షి ఛానెల్‌లో జరిగిన చర్చలను తీవ్రంగా ఖండించారు. సోమవారం చిత్తూరు జిల్లా లో మీడియాతో మాట్లాడిన ఆమె, సాక్షి ఛానెల్ చైర్‌పర్సన్ భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
షర్మిల మాట్లాడుతూ, “మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్నప్పుడు, వారిని అవమానించడం దారుణం. సాక్షి ఛానెల్‌లో జరిగిన చర్చలు మహిళల గౌరవాన్ని దెబ్బతీశాయి” అని అన్నారు. అలాగే, “వైకాపా నేతలు తల్లి, చెల్లిని తరిమేసిన జగన్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. మహిళలపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం సమాజానికి హానికరమని” ఆమె అన్నారు.
Also Read: Dk shiva kumar: గవర్నర్ ను తాను పిలవలే
YS Sharmila: షర్మిల ఈ సందర్భంగా, “సాక్షి పత్రిక, ఛానెల్ ప్రజా సమస్యలను విస్మరించి, వైకాపాకు ప్రచారం చేస్తున్నాయి. ప్రజా సమస్యలను విస్మరించిన మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కింది” అని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.