YS Sharmila: జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘‘ఈడీ అటాచ్ చేసింది షేర్లును కాదు.. రూ.32 కోట్లు విలువైన కంపెనీ స్థిరాస్తిని షేర్ల బదలాయింపులపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు. స్టేటస్‌కో ఉన్నది షేర్స్ మీద కాదు గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ స్టాక్‌మార్కెట్‌లో వాటి షేర్లు, బదిలీలను ఆపలేదు. 2016 భూములను ఈడీ అటాచ్ చేసినందువల్ల.. షేర్లు బదిలీ చేయకూడదని వింతగా చెప్పడం హాస్యాస్పదం అని షర్మిల అన్నారు.
ఇది కూడా చదవండి: MP Anil Kumar Yadav: కేటీఆర్ డ్రగ్ టెస్ట్ చేసుకో
2019లో 100 శాతం వాటాలు బదలాయిస్తామని MOUపై సంతకం చేశారు.. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని? షర్మిల 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కి చెందిన..సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయలక్ష్మికి ఎలా అమ్మారు?అప్పుడు స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా? 2021లో జగన్, భారతి తమ షేర్స్‌పై సంతకాలు చేసి. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. జగన్ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు తెలుసు.’’ అని షర్మిల అన్నారు.