Mokshagna: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన విషయం తెలిసందే. బాలకృష్ణ నటవారసుడి తొలి చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ హీరో కథతో తెరకెక్క బోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞకు ప్రతి నాయకుడుగా దగ్గుబాటి రాణా నటించబోతున్నట్లు వినిపిస్తోంది. హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. విలన్ పాత్రకు రానాతో సంప్రదింపులు జరిగాయట. ఇటీవల ‘వేట్టైయాన్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రానా ప్రస్తుతం దుల్కర్ తో కలసి ఓ సినిమా చేస్తున్నాడు. దానితో పాటు మరి కొన్ని సినిమాలను ఫైనలైజ్ చేయవలసి ఉంది. ఇదిలా ఉంటే నవంబర్ నెలాఖరుకు మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ ను ఫైనలైజ్ చేసి డిసెంబర్ లో రెగ్యులర్ షూట్ ను ఆరంభిస్తారట. తేజస్విని నందమూరి తో కలసి సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం రాబోతున్న నందమూరి బాలకృష్ణ వారసుడి సినిమా 2026 ప్రథమార్ధంలో ఆడియన్స్ ముందుకు వస్తుందట.
