YS Jagan: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో దడ పుట్టింది. గత వైసీపీ పాలనలో ఆక్టివిస్ట్‌లు సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేన నాయకులపై అసభ్యకర పోస్టులతో విరుచుక పడ్డారు. సీఎంగా జగన్ ప్రారంభిస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్తూనే టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్‌గా చేసుకుంటూ పోస్టులను పోస్టు చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ అధికారం తమదే అన్నట్లుగా వ్యవహరించారు. జగన్ కూడా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆశలు పెట్టుకున్నారు. చివరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చతికిలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 11 సీట్లతో సర్దుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు సీట్లను గెలుచుకుంది.
YS Jagan: వైసీపీ ఘోర పరాజయంతో అటు నాయకులతో పాటు సోషల్ మీడియా కార్యకర్తల్లో భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు అసభ్యకర పోస్టులను పోస్టు చేసిన వారిపై కొరడా ఝులిపించింది. అందులో భాగంగా వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న వర్రా రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకొని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో దడ పుట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరిని కూకటివేళ్లతో పాతుకు పోయిన వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్టులపై కేసులు పెట్టిందించి. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తల్లో భయం నెలకొంది.
ఇది కూడా చదవండి: Waste Tax Cancel: చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం
YS Jagan: సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన వైసీపీ నాయకుల్లో కూటమి ప్రభుత్వం భయం నెలకొన్న సందర్భంగా వారికి భరోసా ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు లీగల్ సెల్ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పని చేసేలా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్నులో జిల్లాల వారీగా ఉమ్మడి కర్నూల్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మరో నేత సురేంద్రరెడ్డిను తీసుకున్నారు. వీరు సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా అంటూ లీగల్ టీమ్‌తో ఆర్డినేషన్ చేసుకుంటారు. మరి వీరిద్దరూ సోషల్ మీడియా కార్యకర్తలకు ఏమాత్రం అండగా ఉంటారో… టాస్క్ ఫోర్స్ ఏ మేరకు పని చేస్తోందో… చూడాలి మరి.