YouTube : కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ గుడ్‌న్యూస్

కంటెంట్ క్రియేటర్స్‌కి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 60 సెకన్లు మాత్రమే ఉంటున్న షార్ట్స్ నిడివిని ఈ నెల 15 నుంచి 3 నిమిషాలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కంటెంట్‌ని మరింత విస్తృతంగా చెప్పేందుకు ఎక్కువ నిడివి కావాలంటూ చాలాకాలంగా తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని ఈ సందర్భంగా వివరించింది. దీంతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లు కూడా తీసుకొస్తున్నామని పేర్కొంది. అక్టోబర్‌ 15 నుంచి ఈ మార్పు రానుంది. దీంతో కంటెంట్‌ క్రియేటర్లు తమ కంటెంట్‌తో యూజర్లకు మరింత చేరువ కావడానికి వెసులుబాటు కలగనుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో, క్రియేటర్స్ తమ వీడియోలను మరింత క్రియేటివ్‌గా తయారుచేసుకోవచ్చు.

ఇక కంటెంట్‌ క్రియేషన్‌కు సంబంధించి మరికొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది యూట్యూబ్‌ . కొత్తగా టెంప్లేట్‌ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్‌ వీడియోలను రీమిక్స్ బటన్‌ ద్వారా కొత్త వీడియోగా రీ క్రియేట్‌ చేయొచ్చు. ట్రెండింగ్‌, పాపులర్‌ వీడియోలకు పర్సనల్‌ టచ్‌ ఇవ్వడంలో కంటెంట్‌ క్రియేటర్లకు ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. అలాగే, యూట్యూబ్‌ కంటెంట్‌ను షార్ట్స్‌గా మలిచేందుకూ రాబోయే కొన్ని నెలల్లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chia vs Sabja Seeds: చియా vs సబ్జా విత్తనాలు .. రెండిట్లో ఏవి ఆరోగ్యానికి మంచివి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *