Kim Jong Un

Kim Jong Un: కొడుకుని కాదని.. కూతురిని ప్రమోట్ చేస్తున్న కిమ్..?

Kim Jong Un: బీజింగ్ పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జో ఆహ్ మరోసారి అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారరు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆమెను తన తండ్రి వారసురాలిగా బావిస్తునట్టు తెలుస్తుంది.దీనికి బలం కూర్చే విధంగానే అతనే పనులు కూడా కనిపిస్తున్నాయి. 2022లో తొలిసారి బహిరంగ వేదికపై కనిపించిన ఈ చిన్నారి, అప్పటి నుంచి ప్రతి ముఖ్యమైన రాజకీయ, సైనిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

కుటుంబ రహస్యాలు, వారసత్వంపై చర్చలు

కిమ్ జోంగ్ ఉన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు, చిన్న కొడుకు గురించి పెద్దగా సమాచారం లేదు. అయితే జో ఆహ్‌ను మాత్రం ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీనితో ఆమెను వారసురాలిగా సిద్ధం చేస్తున్నారనే చర్చలు బలంగా వినిపిస్తున్నాయి.

1948 నుంచి ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ కుటుంబం తమను “పవిత్ర రక్తసంబంధం” వారసులమని చెబుతుంది. కానీ ఇప్పటి వరకు పురుషులే పాలించిన ఈ దేశంలో కుమార్తెను ముందుకు తీసుకురావడం పితృస్వామ్య దృక్పథాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు.

గౌరవం పొందిన ఏకైక వారసురాలు

ఉత్తర కొరియాలో “గౌరవనీయమైన” అనే బిరుదు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇప్పటివరకు ఈ గౌరవాన్ని కిమ్ జో ఆహ్ మాత్రమే పొందింది. సైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాలు, అధికార విందులు వంటి కీలక కార్యక్రమాల్లో తన తండ్రి పక్కన నిలబడుతూ ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది.

ఇది కూడా చదవండి: Tube Master: టీచర్ అంటే ఎలా ఉండాలో చూపిన లెక్కల మాస్టర్.. 20 ఏళ్లుగా స్కూల్‌కి వెళ్లేందుకు నదిలో ఈత

వ్యక్తిగత ఆసక్తులు, ప్రత్యేక శిక్షణ

దక్షిణ కొరియా నిఘా సంస్థ ప్రకారం, కిమ్ జో ఆహ్ గుర్రపు స్వారీ, స్కీయింగ్, ఈతలపై ఆసక్తి కలిగిన అమ్మాయి. ప్యోంగ్యాంగ్‌లో ఇంటి నుంచే ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని చెబుతున్నారు.

భవిష్యత్తు సంకేతాలు

బీజింగ్ పర్యటనలో జో ఆహ్ అంతర్జాతీయ వేదికపై మొదటిసారి కనిపించడం, ఆమె వారసత్వంపై ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జోంగ్ కంటే తన కుమార్తెను ముందుకు నెడుతున్న తీరు కూడా రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి రేపుతోంది. పురుష ఆధిపత్యం గల ఉత్తర కొరియా రాజకీయాల్లో జో ఆహ్ భవిష్యత్తులో చరిత్ర సృష్టించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *