Nithya Menen: పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేని అమ్మాయి తన బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలని తపించే కథతో తెరకెక్కుతోంది తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’. ‘జయం’ రవి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రధారులుగా కిరుతిగ ఉదయనిధి దీనిని తెరకెక్కించారు. ఈ ముక్కోణ ప్రేమకథాచిత్రంలో యోగిబాబు, మనో, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 14న పొంగల్ కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అందులో నిత్యామేనన్ పోషించిన పాత్ర అమిత ఆసక్తిని కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Cold Water Bath: చల్లటి నీటితో స్నానం చేస్తున్నారా..?అయితే జాగ్రత్తా
కథ మాత్రమే ఇస్తానంటున్న అట్లీ!
Atlee: తమిళ దర్శకుడు అట్లీ ‘రాజా రాణీ’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, వరుసగా ‘తేరీ, మెర్సిల్, బిగిల్’ చిత్రాలను రూపొందించి విజయాలు అందుకున్నాడు. ఇక 2023లో ‘జవాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అదీ సూపర్ హిట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ అట్లీ తమిళ చిత్రం ‘తేరీ’ హిందీలో ‘బేబీ జాన్’గా రీమేక్ అయ్యింది కానీ పరాజయం పాలైంది. అయినా అట్లీ కథలకు బాలీవుడ్ లో డిమాండ్ తగ్గలేదనిపిస్తోంది.
Atlee: కొంతకాలంగా అట్లీ, షాహిద్ కపూర్ తరచూ స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నారు. వీరి మీటింగ్స్ కు ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చేసిందని, షాహిద్ కోసం ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కథను అట్లీ సిద్ధం చేశాడని, త్వరలోనే ఆయన శిష్యుడు దీనిని డైరెక్ట్ చేసేట్టుగా ప్రకటన వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం షాహిద్ కపూర్ ‘దేవా’ మూవీ చేస్తున్నాడు. అది ఇదే నెల 31న విడుదల కాబోతోంది.